వాత్స్యాయన కామశాస్త్రం
కామశాస్త్రం : భారతీయ సాహిత్యంలో “కామం” గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం ( కౌటిల్యుని అర్థశాస్త్రం ) లాగానే, కామశాస్త్రం కూడా ఒక శాస్త్రీయ గ్రంధము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను , ఇంద్రియాలకు ఆనందాన్ని , ప్రేమికుల మధ్య మరియు దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి చిరకాల అనుబంధాన్ని పెంపొందించే మార్గాలను సూచించే ఆచరణాత్మక ధోరణి కలిగి ఉన్న సాహిత్యం.