నా ప్రియమైన శ్రీవారు
ఎదురుగా నిలబడి ఉన్న సూర్యనారాయణ ని చూసి “ఎవరు నువ్వు? మా రూం లో ఏం చేస్తున్నావ్?” అన్నాడు ముద్ద ముద్దగా మాటలు తడబడుతుండగా. నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఆయన ఇప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ళని గుర్తించేంత స్పృహలో లేరని. “గంగారావు నేను సూర్యనారాయణ ని, ఇది మీ రూం కాదు నా రూం, ఇది మా రూం కాదా? ఐతే నారూం ఎక్కడా అన్నాడు సూర్యనారాయణ. నన్ను తీసుకువెళ్ళు. మీ చెల్లి కంగారు పడుతుంది.”