అతి సర్వత్ర వర్జయేత్ – 4
సుబ్రమణ్యం ఉన్న వీధిలోనే బాగా పరిచయం ఉన్న కుటుంబం ఒకటి షిర్దీ వెళ్తుందని తెలిసి తను కూడా వెళ్లొస్తానంది శారదమ్మ. “అలాగే వెళ్లిరా పిన్నీ…గీతకి కూడ సెలవులేకదా తనని కూడ తీసుకెళ్లు..తనూ చూసినట్లూ..మీకు తోడున్నట్లు కూడా ఉంటుంది” అన్నాడు సుబ్రమణ్యం. తల్లీకూతుళ్లు వెళ్లిన రోజు రాత్రే తమ పార్టీలు మార్చుకునే ప్రోగ్రాం అమలుచెయ్యాలనుకున్నారు సుబ్రమణ్యం దంపతులు. ఆరోజు మధ్యాహ్నమే రాధతో చెప్పింది శ్రావణి రాత్రి ప్రోగ్రాం గురించి..