సరస భేతాళం!|Telugu Kathalu
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, శవాన్ని దింపి భుజానవేసుకొని, ఎప్పటిలాగే శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు “రాజా! సత్తెకాలపునాటి వ్యధలూ,గతించిన గాథలూ, సన్మార్గపు కథలూ నీకు చెప్పటం నాకు అలవాటే! విశదంగా విప్పిచెప్పటం నీకు పరిపాటే కదూ! అవ్వన్నీ విన్నవారు ఊకొట్టారూ, చదివినవారు చప్పట్లుకొట్టారూ, మెదడుకి మేతాపెట్టారు,విజ్ఙ్నులై తరించారు! ఇంతచేసినమనం ఎందుకు సరసమైన కథలను సంధించి రసఙ్గ్నులను రమింపచెయ్యకూడదనే తలంపుతో మొదటిగా ‘నెరజాణ ‘ కథని చెబుతున్నాను. సమ్మగా విను! ” అంటూ