ముగ్గురు మిత్రులు గదిలో కూచుని తీరిగ్గా మందుకొడుతున్నారు. ఒకడి పేరు అనీల్, రెండోవాడి పేరు సునీల్, మూడోవాడి పేరు వినీల్. ముగ్గురూ బ్రహ్మచారులే. అంతా పాతికేళ్ళలోపు వయసువాళ్ళు. పైగా ముగ్గురూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు.మేడమీద గదిలో అద్దెకుంటూ బద్దిమంతులని పేరు తెచ్చుకున్నారు. వారం పొడుగునా మందుకాని సిగరెట్ గానీ ఏదీ ముట్టుకోరు. కానీ ఒక్క ఆదివారం రాత్రి మాత్రం చక్కగా చికెనో మటనో వండుకుంటారు. ఫుల్బాటిల్ మందు తెచ్చుకుంటారు.అర్దరాత్రి వరకు మందుకొడుతూ సిగరెట్లు కాలుస్తు ఎంజాయ్ చేస్తారు. అలాగని అరుపులు కేకలు గలాటా ఏమీ ఉండవు. మందుకొడుతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటారు.
ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా మందుకొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బయట వాతావరణం మారిపోయి రాత్రి తొమ్మిధి గంటలనుంచే ఈదురుగాలితో బాటు జల్లులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణం కూడా అనుకూలించడంతో ముగ్గురూ హాపీగా వన్నారు. మందుకొడుతూ చికెన్ ముక్కలు లాగిస్తూ దమ్ము కొడుతూ ఆనందమంతా తమదే అన్నంత సంతోషంగా ఉన్నారు. అప్పటికి రాత్రి పదికావొస్తుంది సమయం. “ఒరే నాకో అయిడియా వచ్చిందిరా” అన్నాడు సునీల్. “అంత గొప్ప ఐడియానా అయితే చెప్పు విందాం అన్నాడు రింగులురింగులుగా పొగవదులుతూ వినీల్. “ఏం లేదురా. అమ్మాయిల విషయంలో మనలో ఎవరి అనుభవం వాళ్ళకుంది. అవునా?”అడిగాడు సునీల్. “ఉంది.అయితే ఏమైంది?”అన్నాడు అనీల్. “అక్కడే ఉందిమరి థ్రిల్.మనకున్న అనుభవాల్లో మంచి థ్రిల్ ఉన్న అనుభవాన్ని చెప్పాలి.ఎవడు చెప్పిన అనుభవం థ్రిల్ గా ఉంటే వాడికి మందు ఫ్రీ” అన్నాడు. ఇదేదో బాగానే ఉందిగాని మందు ఫ్రీగా కొట్టేయాలని చెత్త ప్లానేమీ కాదుగదా? అడిగాడు అనుమానంగా అనిల్. “ఛఛ ఛాన్సేలేదు.